Saturday, April 5, 2014

తెలుగు నెలలు (Telugu Months, Years. Hindu Months, Years)

మన తెలుగు నెలలు చంద్రుని గమనం ప్రకారం నిర్ణయించబడతుంది.
మనకు కొత్త సంవత్సరం ఉగాది తో మొదలవుతుంది. ఉగాదిని మామూలుగా యుగాది అనాలి. యుగాది అనగా యుగం + ఆది. అంటే యుగానికి మొదలు అని అర్థం.

ఒక సంవత్సరంల 12 మాసాలు (నెలలు) గా విభజించబడినది.
ఒక మాసనికి (నెలకి) 2 పక్షాలు. శుక్ల (శుద్ధ) మరియు కిృష్ణ (బహుళ) పక్షం.
శుక్ల పక్షం ఎగువ చంద్రుడు, అంటే చంద్రుడు క్రమ క్రమంగా పెరుగుతూ పౌర్ణమి తో మగుస్తుంది.
కిృష్ణ (బహుళ) పక్షం అంటే దిగువ చంద్రుడు.  చంద్రుడు క్రమ క్రమంగా తగ్గుతూ  అమావాస్యతో మగుస్తుంది.



ఒక పక్షం లో 15 రోజులు. అవి,

  1. పాడ్యమి, 
  2. విదియ, 
  3. తదియ, 
  4. చవతి, 
  5. పంచమి, 
  6. షష్టి, 
  7. సప్తమి, 
  8. అష్టమి, 
  9. నవమి, 
  10. దశమి, 
  11. ఏకాదశి, 
  12. ద్వాదశి, 
  13. త్రయోదశి, 
  14. చతుర్దశి, 
  15. పౌర్ణమి లేక అమావాస్య.

ఇప్పుడు నెలల విషయానికి వస్తే, ఒక సంవత్సరంలో 12 మాసాలు (నెలలు). అవి,

  1. చైత్రం        - మార్చి/ఏప్రెల్
  2. వైశాఖం    - ఏప్రెల్ / మే
  3. జ్యేష్ఠం       - మే / జూన్ 
  4. ఆషాఢం    - జూన్ / జూలై
  5. శ్రావణం     - జూలై / ఆగష్ట 
  6. భాద్రపదం  - ఆగష్ట / సెప్టెంబర్
  7. ఆశ్వీజం    - సెప్టెంబర్ / అక్టోబర్
  8. కార్తీక        - అక్టోబర్ / నవంబర్
  9. మార్గశిర    - నవంబర్ / డిసెంబర్
  10. పుష్యం        - డిసెంబర్ / జాన్వరి
  11. మాఘ       - జాన్వరి / ఫిబ్రవరి
  12. ఫాల్గుణం    - ఫిబ్రవరి / మార్చి

2 నెలలు కలిపితే ఒక ఋతువు అవుతుంది.

ఆరు (6) ఋతువులు ఉన్నాయి. అవి,
  1. వసంతం        - చైత్రం + వైశాఖం           - పువ్వులు విచ్చుకునే కాలం       - Spring            
  2. గ్రీష్మ             - జ్యేష్ఠం + ఆషాఢం       - ఎండా (వేసవి) కాలం               - Summer
  3. వర్ష               - శ్రావణం + భాద్రపదం   - వాన కురిసే కాలం                  - Rainy
  4. శరద్             - ఆశ్వీజం + కార్తీక      - ఆకులు రాలే కాలం            - Autumn(Fall)
  5. హేమంతం      - మార్గశిర + పుష్యం     - చలి కాలం                         - Winter
  6. శిశిర             - మాఘ + ఫాల్గుణం     - మొగ్గ తడిగే కాలం               - Prevernal   
మన సంవత్సరాలు మొత్తం అరవై (60). అవి,

సంవత్సరం పేరు సంవత్సర ఫలితం
1987 - 88 ప్రభవ యజ్ఞములు ఎక్కువగా జరుగును
1988 - 89 విభవ ప్రజలు సుఖంగా జీవించెదరు
1989 - 90 శుక్ల సర్వ శస్యములు సమృధిగా ఉండును
1990 - 91 ప్రమోద్యూత అందరికీ ఆనందానిచ్చును
1991 - 92 ప్రజోత్పత్తి అన్నిటిలోనూ అభివృద్ది
1992 - 93 అంగీరస భోగములు కలుగును
1993 - 94 శ్రీముఖ లోకములన్నీ సమృధ్దిగా ఉండును
1994 - 95 భావ ఉన్నత భావాలు కలిగించును
1995 - 96 యువ ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును
1996 - 97 ధాత అన్ని ఓషధులు ఫలించును
1997 - 98 ఈశ్వర క్షేమము - అరోగ్యాన్నిచ్చును
1998 - 99 బహుధాన్య దెశము సుభీక్షముగా ఉండును
1999 - 2000 ప్రమాది వర్షములు మధ్యస్తముగా కురియును
2000 - 01 విక్రమ సశ్యములు సమృద్దిగా పండును
2001 - 02 వృష వర్షములు సమృద్దిగా కురియును
2002 - 03 చిత్రభాను చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును
2003 - 04 స్వభాను క్షేమము,ఆరోగ్యానిచ్చును
2004 - 05 తారణ మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును
2005 - 06 పార్ధివ సంపదలు వృద్ది అగును
2006 - 07 వ్యయ అతి వృష్టి కలుగును
2007 - 08 సర్వజిత్తు ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును
2008 - 09 సర్వధారి సుభీక్షంగా ఉండును
2009 - 10 విరోధి మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును
2010 - 11 వికృతి భయంకరంగా ఉండును
2011 - 12 ఖర పుషులు వీరులగుదురు
2012 - 13 నందన ప్రజలు ఆనందంతో ఉండును
2013 - 14 విజయ శత్రువులను సం హరించును
2014 - 15 జయ శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు.
2015 - 16 మన్మధ జ్వరాది భాదలు తొలిగిపోవును
2016 - 17 దుర్ముఖి ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు
2017 - 18 హేవళంబి ప్రజలు సంతోషంగా ఉండును
2018 - 19 విళంబి సుభీక్షముగా ఉండును
2019 - 20 వికారి శత్రువులకు చాలా కోపం కలింగించును
2020 - 21 శార్వరి అక్కడక్కడా సశ్యములు ఫలించును
2021 - 22 ప్లవ నీరు సమృద్దిగా ఫలించును
2022 - 23 శుభకృతు ప్రజలు సుఖంగా ఉండును
2023 - 24 శోభకృతు ప్రజలు సుఖంగా ఉండును
2024 - 25 క్రోధి కోప స్వభావం పెరుగును
2025 - 26 విశ్వావసు ధనం సమృద్దిగా ఉండును
2026 - 27 పరాభవ ప్రజలు పరాభవాలకు గురి అగుదురు
2027 - 28 ప్లవంగ నీరు సమృద్దిగా ఉండును
2028 - 29 కీలక సశ్యం సమృద్దిగా ఉండును
2029 - 30 సౌమ్య శుభములు కలుగును
2030 - 31 సాధారణ సామాన్య శుభాలు కలుగును
2031 - 32 విరోధికృతు ప్రజల్లో విరోధములు కలుగును
2032 - 33 పరీధావి ప్రజల్లో భయం కలిగించును
2033 - 34 ప్రమాదీచ ప్రామాదములు ఎక్కువగా కలుగును
2034 - 35 ఆనంద ఆనందము కలిగించును
2035 - 36 రాక్షస ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు
2036 - 37 నల సశ్యం సమృద్దిగా ఉండును
2037 - 38 పింగళ సామాన్య శుభములు కలుగును
2038 - 39 కాళయుక్తి కాలయిక్తమయునది
2039 - 40 సిద్ధార్ధి అన్ని కార్యములు సిద్దించును
2040 - 41 రౌద్రి ప్రజలకు భాద కలిగించును
2041 - 42 దుర్మతి వర్షములు సామాన్యముగా ఉండును
2042 - 43 దుందుభి క్షేమము,ధాన్యాన్నిచ్చును
2043 - 44 రుధిరోద్గారి రక్త ధారలు ప్రవహించును
2044 - 45 రక్తాక్షి రక్త ధారలు ప్రవహించును
2045 - 46 క్రోధన జయమును కలిగించును
2046 - 47 అక్షయ లోకములో ధనం క్షీణించును

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home