Sunday, April 6, 2014

వేమన (Vemana)

కాయకంటె తొడిమె మెండు అన్నట్టు, వేమన ఉద్దేశాలను పక్కన పెట్టి, వేమనను వాటేసుకొన్నారు.

వేమన పద్యాలు కాల గర్ఘంలో కలిసి పోకుండా భావి తరాలకు అందజేయడంలో, సి.పి.బ్రౌన్ యొక్క కృషి ఎంతో ఉంది.

1824 లో, సి.పి.బ్రౌన్ మచిలీపట్నం లో ఉన్నప్పుడు, వేమన గరుంచి మొదటి సారి తెలుసుకున్నాడు. వెంటనే పద్యాల సేకరణ మొదలుపెట్టాడు. తాళపత్ర ప్రతులు, చేతివ్రాత ప్రతులు సేకరించి, ఒక వాజ్మయం (Index), "An Index to the Verses of Vemana.. MusuliPatnam, Nov.1824", ప్రచురించాడు.

వేమన సాహిత్యం ఒక కథాకావ్యం గా కాక ముక్తక (నోటి) పద్యాలు గా ఉన్నాయి.
వేమన పద్యాల జానపద సాహిత్యం లాగా, నోటి మాట ద్వారా వ్యాప్తి చెందాయి.

వేమన పద్యాలు కుదురుగా ఒకచోట కూర్చుని రాసినవి కాదు. ఊరూరా తిరుగుతూ, సందర్భం బట్టి, నోటికి వచ్చినప్పుడల్లా చెప్పినవి.

వేమన పద్యాలలో ఆణిముత్యాలు

భూమి లోన పుణ్యపురుషులు లేకున్న
జగములేల నిల్చు పొగులు గాక
అంత తరచు దొరక రాడ నాడను గాని
విశ్వదాభిరామ వినుర వేమ.

అర్థం - ఈ భూమి మంచి మనుషులే లేక పోతే, ఈ ప్రపంచము ఎప్పుడో నశించి పోయేది.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home