Sunday, April 20, 2014

విశ్వదాభిరామ వినురవేమ (Vishwadabhi rama vinura vema; Vemana padyantakam)

విశ్వదాభిరామ వినురవేమ

ఈ వాక్యం వినని తెలుగు వాడుండేమో. వేమన ౧౬, ౧౭  (16, 17) వ శతాబ్దానికి చెందిన మహా కవి.   మనుషులంతా ఒక్కటే అని ప్రభోదించిన మంచి మనిషి. ఇతని పద్యాలన్నీ వాడుక భాష లో ఉండేవి. వేమన సర్వసంగ పరిత్యాగి (అన్ని బంధాలు వదిలేసిన వాడు). ఇతను దిగంబరంగా (బట్టలు లేకుండా) తిరిగే వాడని ప్రసిద్ధి. వేమన ఎక్కడ, ఎప్పుడు పుట్టింది, పెరిగిందీ, తల్లీ తండ్రీ ఎవరనే దాని మీద చాలా పరిశోధన జరిగింది. ఇతని పుట్టుక గురించి ఎన్నో కథలు ప్రాచూర్యం లో ఉన్నా, ఆ కథలలో మహిమల శాతం ఎక్కువగా ఉన్నాయ్. ఒక కథలో, కొండవీటి రాజ్యం వాడని చెప్పారు. కానీ ఏ విధమైన స్పష్టమైన సమాచారము లేదు. ఇతను రాయలసీమ వాడయ్యుంటాడని మాత్రం అందరూ చెప్పగలుగుతున్నారు.  

వేమన చెప్పిన పద్యాలన్నిటికీ రెండు మకుటాలు ఉన్నాయి.
౧)   వేమా
౨)   విశ్వదాభిరామ వినురవేమ
మకుటం అంటే కిరీటం. మామూలుగా మన తెలుగు పద్యాలు, నాలుగు  పాదాలుగా(వాక్యాలుగా) రాస్తారు. అందులో చివరి వాక్యన్ని, మకుటం అని వ్యవహరిస్తారు.
వేమా అనే చిన్న మకుటం, కొన్ని ఆటవెలదులకు(ఇది ఒక పద్య రీతి) మరియు ఆటవెలదులు కాని, అన్ని పద్యాలకు ఉండగా, విశ్వదాభిరామ వినురవేమఅనేది ఆటవెలదులకు మాత్రమే ఉంది.
ఆటవెలది పద్యంలో నాలుగు పాదాలుంటాయి. వేమన్న పద్యంలో నాలుగు పాదాలుంటాయి. వేమన్న తాను చెప్పవలసినదంతా మొదటి మూడు పాదాలలోనే చెప్పాడు. మకుటం మాత్రం కేవలం పద్య నిర్మాణ పరిపూర్ణతకు మత్రమే వాడాడు. మకుటం లేకున్నా పద్యానికున్న అర్థం చెడిపోదు.
విశ్వదాభిరామ వినురవేమ
ఈ వాక్యంలో మూడు పదాలున్నాయి.
౧)   విశ్వదాభిరామ
౨)   వినుర
)    వేమ
ఇంత ప్రసిద్ధమైన, శ్రవణసుందరమైన (వినడానికి ఇంపుగా ఉండే) విశ్వదాభిరామ వినురవేమ మకుటానికి తృప్తికరమైన అర్థం చెప్పినవారు లేరు.

తనకు తాను అర్థం చెప్పుకున్న వాడులా అయుండచ్చు.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home