Sunday, June 15, 2014

అసమర్థుని జీవయాత్ర - త్రిపురనేని గోపిచంద్ (Asamarthuni jeevayatra - tripuraneni gopichand)

జూను 15

ఈ రోజు, జలగం వెంగళరావు ఉద్యానవనంలో అసమర్థుని జీవయాత్ర పై చర్చ జరిగింది.

ఎందుకు అనే ప్రశ్నకి అంతేలేదు. జీవితంలో ప్రతి దశకి ఒక నిర్ణీత కాలం ఉంటుంది. ఙానం కాలంతో పాటు మారుతూ ఉంటుంది. మంచి చెడు, నిజం అబద్ధం సందర్భం బట్టి పరిణితి చెందుతూ ఉంటుంది.
మన సీతారామావు కీర్తి మాయలో పడి, చివరికి తిండికి గుడ్డకి అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. అన్నం కోసం, సుఖం కోసం కష్టపడడం నీచంగా భావించే అతను, తరువాత అదే చేయాల్సివస్తుంది. ఎన్నో గప్ప ఆశయాలు మనసులో అనుకుంటూన్నా, ఏదీ సాధించలేక కొపం చెంది, తన కోపాన్ని భార్య, కూతురు మీద చూపిస్తాడు. తన ప్రవర్తనతో తనే విసుగు చెంది, ఎందుకింత దిగజారిపోయానా అని తర్కించుకుంటాడు. ఒక్కొక్కరినీ నిందిస్తూ వెళతాడు. మొదట మేనమామ, మామ, భార్య, స్నేహితులు, చివరికి శ్మశానంలో ఉన్న తన తండ్రిని తప్పుపడతాడు. వాళ్ల వల్ల నేను చెడిపోయానా లేక నా వల్ల వాళ్లు చెడిపోయారా అని మథనపడతాడు. కడకు ఎంతో హింసాత్మకంగా తన ప్రాణాలు వదులుతాడు.

ప్రతి మనిషిలోనూ ఒక సీతారామారావు ఉంటాడు. ఎందుకు ఎందుకు అని ప్రశ్నంచే తత్వం. ఆత్మ విమర్శ చాలా లోతుగా చేసుకుంటాడు. తన అసమర్థతని ఒప్పుకోలేని మనిషి జీవితం ఇది. సీతారామారావు ఎందుకు అలా అయ్యాడు. అతను ఏ పరిస్థితుల వల్ల అలా మారాడు. ఆలోచనలు ఎంత వరకు మంచిది. ఈ రచనలో చాలా లోతుగా ఆత్మవిమర్శ ఉంటుంది. ఇందులోని కొన్ని ఘట్టాలు ఎంతో నవ్వుని తెప్పిస్తాయికొన్ని బాధనిభయాన్ని కలిగిస్తాయి. చదువుతున్నప్పుడల్లా చాలా చోట్ల మనల్ని మనం చూసుకుంటాం. 


ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవవలసిన పుస్తకం. ఈ రచన చదవడం ద్వారా, కనీసం మన తప్పులను మనం ఒప్పుకనే లక్షణం అలవడుతుంది.